Tuesday, November 20, 2012

0 బంద్ పాటించాల్నా అన్నందుకు జైలు ల పెడతారా ???


ఏమయ్యా !! ఎటు పోతంది దేశం?? ఏమి ఎర్క అయితలే నాకైతే !!
అప్పుడు గంతే, ఆ కన్నడ హీరో రాజ్ కుమార్ వయసయిపోయి సత్తే ,
ఎన్ని గొడవలు జరిగినాయో యాదికి ఉన్నదా ??
జనాలకి పిచ్చి పట్టింది. మారరు.
ఇప్పుడేమో ఈ టైగర్ సచ్చిపోతే బంద్ పాటించల్నా అన్నందుకు, అది గుడా పేస్బుక్ ల,
దానికి లైక్ కొట్టినందుకు పాపం పోరి లను ( షాహీన్,రేణు) అరెస్ట్ జేస్తారా ?
వాళ్ళ దవఖానని పగుల గోడ్తరా !!?? ఇది ఇండియా నా చైనా నా ??
ఇగ ఇది రాశినందుకు నన్ను, చదివినందుకు నిన్ను అరెస్ట్ జేత్తరేమో, జరంత ఉషారు గుండుండి.

0 comments:

Post a Comment

మీ ముచ్చట చెప్పుండ్రి.