Tuesday, October 30, 2012

0 ఎవరన్న చెప్పుండ్రి జర

పేద ప్రజలకు ఉచితంగా ఇల్లు - చంద్రబాబు. అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి - కిరణ్ కుమార్ రెడ్డి. కర్మరా... బాబు కర్మ.... నేను టాక్స్ కడితే, నాకు రోడ్ ఉండది, కరెంటు ఉండది, infrastructure ఉండది. ఎవడో పేదోడు అని చెప్పి వానికి ఇల్లు కట్టిస్తాడంట, చంద్రబాబు, వానికి సంక్షేమ పథకం అందేల చుస్తాడంట కిరణ్ కుమార్ రెడ్డి, మరి నేను కస్టపడి సంపాదించి టాక్స్ కట్టల్నా, లేక పెదోనిగా మిగిలిపోయి ఇవన్ని పొందాల్నా..... ఎవరన్న చెప్పుండ్రి జర.................

Monday, October 29, 2012

0 ఎవరో చేసిన పాపాలను దివంగత మహానేత వైఎస్ఆర్

ఎవరో చేసిన పాపాలను దివంగత మహానేత వైఎస్ఆర్ పైన వేశారని ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వై.ఎస్. చేసిన పాపాలను మేం వేరే వాళ్ళపై వేసాం.

Sunday, October 28, 2012

0 సినిమా పైరసీ - మనం ఎం జెయ్యలే

మనం పైరసీ సి. డి. కొనద్దు. థియేటర్ కే పోవాలె. టికెట్ దొరక క పోతే బ్లాక్ ల కొనాలే. పార్కింగ్ కు 20 పది రూపాయల కూల్ డ్రింక్ కి 20 పెట్టలే. 5 రూపాయల pop కార్న్ కి 15 పెట్టలే. సమోసా గిట్ట తిన్నావంటే ఇగ దావఖాన నే దిక్కు. ఇగ ఒకటి కి రెంటికి వచ్చిందా అపుకోవాలే. కనీసం వాటి వంక కూడా పోవద్దు మల్ల. ఛి ఛి..... ఇగ సీట్లల్ల నల్లు లు కుడ్తే పడాలే. ఎండా కాలమైతే , ఏ.సి ఉండది. చలి కాలమైతే ఫాన్ ఉండది. ఇగ మన కర్మా గాలి ఉంటె, అది మనకే ఫుల్ గాలి కొడ్తది. దుమ్ము కూడా వస్తది. అయిన సరే థియేటర్ ల నే సుడాలే !! అంతే మల్ల.

Friday, October 26, 2012

0 భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఎత్తిపోయాయి. పంటలు ఎండిపోయాయి. - షర్మిలా

భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఎత్తిపోయాయి. పంటలు ఎండిపోయాయి. - షర్మిలా జగనన్నని గెలిపించండి, అనిల్ తో ప్రార్థనలు చేయించి వర్షాలు కురిపిస్తం, పంటలు ఎండిపోకుండా చేస్తాం.

0 సీఎంతో పొసగని మంత్రులు-పడకేసిన పాలన - సాక్షి.

సీఎంతో పొసగని మంత్రులు-పడకేసిన పాలన - సాక్షి. జగనన్నని గెలిపించండి, అందరం సమిష్టిగా దోచుకుంటామ్.