Tuesday, December 4, 2012

1 రోమ్ లో రోమన్ లాగ నే ఉండాలి.


ఇక్కడ ఒక ముచ్చట చెప్పలే మీకు, రోమ్ ల రోమన్ లెక్క నే ఉండాలే!! (Be a roman in Rome).
అదేధో సినిమా ల పవన్ కళ్యాణ్ అంటడు, నేను రోమ్ కి పోయిన ఇండియన్ లెక్క నే ఉంటా అని.
అది హీరో, సినిమాల చెప్తే మంచిగానే ఉంటది. కానీ ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ గాదు.
గిదంత ఎందుకు చెప్తున్నా అంటే, నార్వేల మన తెలుగోళ్ళకి జైలు శిక్ష వేసిండ్రు కదా....
మరి వాళ్ళ కంట్రీ కి పోయినప్పుడు, వాళ్ళ చట్టాలు ఎట్లుంటాయి తెలుసుకొవాలె. అదే వాళ్ళు జేశిన తప్పు.
గి సాఫ్ట్వేర్ కంపెనీ లల్ల వేరే కంట్రీ కి తోలే ముందు మస్తు చెప్పి పంపుతారు,
వాళ్ళు చెప్పక పోతే మనం గూగుల్ చేసి తెలుసుకొవాలె...... లేకపోతే ఇగో గిట్లనే అయితది.

Wednesday, November 21, 2012

1 ఓ పీడ పోయింది.


అబ్బ!! ఓ పీడ పోయింది. అంటే ఏంలేదు మల్ల, ఓ దరిద్ర్యం వదిలి పోయింది అని.
కసాయి కసబ్ గాన్ని రహస్యంగా మస్త్ ఉరి దీశిండ్రు,
కాంగ్రెస్ వొళ్ళు ఒక మంచి పని జేశినట్టు కనపడుతాంది.. ఏమంటరు??
లేకపోతే ఏంది ???
ఇప్పటిదాకా వీనికి బీరు బిర్యానీ పెట్టి మస్తు దున్నపోతు లెక్క పెంచిండ్రు. ఇప్పటికైనా తెలివి కొచ్చిండ్రు...
ఇంకా లిస్టు ల మస్తు మంది ఉన్నరట గదా!!? ఇగ సుడాలే, ఏమైతదో..
ఆ అఫ్జల్ గురు అంటున్నారు వాణ్ణి గూడా ఉరి దిస్తే ఓ పని అయిపోతది.

అసలు నాకు ఈ మరణ శిక్ష అంటే వ్యతిరేకత ఉంది కాని ఇట్లాంటి వాళ్ళని జూస్తే ఇది గూడా తక్కువే అనిపిస్తది.

Tuesday, November 20, 2012

0 బంద్ పాటించాల్నా అన్నందుకు జైలు ల పెడతారా ???


ఏమయ్యా !! ఎటు పోతంది దేశం?? ఏమి ఎర్క అయితలే నాకైతే !!
అప్పుడు గంతే, ఆ కన్నడ హీరో రాజ్ కుమార్ వయసయిపోయి సత్తే ,
ఎన్ని గొడవలు జరిగినాయో యాదికి ఉన్నదా ??
జనాలకి పిచ్చి పట్టింది. మారరు.
ఇప్పుడేమో ఈ టైగర్ సచ్చిపోతే బంద్ పాటించల్నా అన్నందుకు, అది గుడా పేస్బుక్ ల,
దానికి లైక్ కొట్టినందుకు పాపం పోరి లను ( షాహీన్,రేణు) అరెస్ట్ జేస్తారా ?
వాళ్ళ దవఖానని పగుల గోడ్తరా !!?? ఇది ఇండియా నా చైనా నా ??
ఇగ ఇది రాశినందుకు నన్ను, చదివినందుకు నిన్ను అరెస్ట్ జేత్తరేమో, జరంత ఉషారు గుండుండి.

Monday, November 19, 2012

1 పోయినోల్లందరు మంచోల్లేనా ????


ఇగ ఈ మీడియా ను సూత్తాంటే నాకు ఓ అనుమానం వచ్చింది.
అది ఏందంటే పోయినోల్లందరు మంచోల్లేనా అని.
గిప్పుడు ఏంది వయ్య అనుకుంటున్నారా ఏంది.
ఆహా ఎంలే, మరాఠా పులి, రాజకీయ దురంధరుడు అని పెద్ద పెద్ద హెడ్డింగులు ఏవో జుషిన
అన్ని న్యూస్ ఛానళ్ళు పేపర్లు మస్తు టంకా బజాయిన్చినయి.
ఈ పెద్ద మనిషి చేసిన పాపాలు ఎవ్వరికి గుర్తు రాలే.
ఇగ సచ్చిపోయిన రాజ శేకర్ రెడ్డి అయితే మహానేత అని మనం రోజు చూస్తానే ఉన్నం.
ఇంక కొన్ని రోజులయితే దావుద్ ఇబ్రహీం ని కూడా ఇట్లానే మస్తు పొగుడ్తరేమో (సచ్చిపోయినక నే),
ఇంకో మస్తు జోక్ ఏందంటే, ప్రతి నాయకుడు సంతాపం ప్రకటించుడే!!! ఏందో !!!!

Thursday, November 8, 2012

0 షర్మిల ఓదార్పు విశేషాలు...

షర్మిల : నమస్తే అమ్మ, నమస్తే అయ్యా. నమస్తే అక్క, నమస్తే అన్న, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు,నమస్తే బాబు, నమస్తే పాపా..

ఒక అమ్మ: నమస్తే.. సల్లగుండమ్మ, నిన్ను సుత్తే అచ్చం రాజన్నను చుశినట్టే ఉంది.

ష: చెప్పమ్మ ఎంటీ మీ కష్టాలు.

అమ్మ: వర్షాలు కురవట్లేదు, పొలం ఎండిపొయింధి. చానా కష్టాల్లో ఉన్నం.

ష: రాజన్న ఉంటె వర్షాలు పడేవి, ఇప్పుడున్నది రాజన్న ప్రభుత్వం కాధు.

ష: చెప్పండయ్య నీ కష్టం ఏమిటి ?

అయ్య: ఏం చెప్పలే, నాకు ఈ మధ్యలొ జబ్బు చేసింధి. ఒంటికి , రెంటికి పొనికి ఇబ్బంది అవుతుంది.

ష: ఇది రాజన్న రాజ్యం కాధు. రాజన్న ఉంతె నీకు ఒంటికి , రెంటికి సమయానికి వచ్చెవి.
జగనన్న వచ్చినన తరువాత మళ్ళీ టైం కి వస్తాయి.

ష: తమ్ముడు నీ ప్రాబ్లం ఏమిటి ?

తమ్ముడు: పరీక్షల్లో కాపీ కోడుతుంటే , డిబార్ చెసారక్క

ష: రాజన్న ఉంటె నీకి పరిస్తితి వచ్చెదే కాధు. చెల్లెమ్మ నీ సంగతి ఎంటి ?

చెల్లెమ్మ: నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశినాడు అక్క.

ష: చుసినావా రాజన్న ఉంటే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చెసెవాడే కాదు.బాబు నీ సంగతి?

బాబు: మా అమ్మ ఐస్ క్రీం కొనిస్త లేదు అంటీ...!!

ష: రాజన్న ఉంటె కొనిచ్చేది... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి...మీ అందరికి ఇలా జరుగుతుంది...


రాజన్న ఉంటె.......!!!!!!!??????&&&&&&$$$$$######